రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ గా పి కిషోర్ ను ఉన్నతాధికారులు నియమించారు. ఈ మేరకు తాజాగా డిఎంఏ నుంచి ఉత్తర్వులు అందినట్లు మున్సిపల్ కార్యాలయ వర్గాలు బుధవారం తెలిపారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ గా చేస్తున్న కిషోర్ ను ఇక్కడికి బదిలీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న షేక్ మాలిక్ ను డిఎంఏ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు చెప్పారు.