గాజాలో హమాస్‌పై యుద్ధం నిలిపివేసే విషయంలో ఇజ్రాయెల్, అమెరికా మధ్య విభేదాలు రోజురోజుకీ ముదురుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి అగ్రరాజ్య అధ్యక్షుడు బైడెన్ పిలుపునిస్తుండగా..
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అందుకు నిరాకరిస్తున్నారు. తాము చేస్తున్న పోరాటానికి హార్వర్డ్-హారిస్ పోల్‌లో దాదాపు 82 శాతం మంది అమెరికావాసులు తమకు మద్దతుగా పలికినట్లు పేర్కొన్నారు.