ఇంటర్ పరీక్షల నేపథ్యంలో రాప్తాడు మండలంలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్ యూ ఐ జిల్లా నాయకులు మంజునాథ్ కోరారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ. ప్రైవేట్, కార్పొరేట్ కొన్ని కళాశాలలో విద్యార్థులకు ఫీజుల పేరుతో హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. అలాంటి కళాశాలలపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.