ముస్లింలకు టీడీపీ హయాంలోనే న్యాయం జరుగుతుందని ఆ పార్టీ హిందూపురం పార్లమెంట్ మైనార్టీ ప్రధాన కార్యదర్శి నాగూర్‌హుస్సేన పే ర్కొన్నారు. ధర్మవరం పట్టణంలోని 14 వార్డులో గల ముస్లిం కుటుంబాలకు మంగళవారం ఆయ న స్థానిక మైనార్టీ నాయకులతో కలిసి యాసినసూర ఫొ టోలను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ పార్టీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు అందేవన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ పథకాలన్నీ రద్దయ్యాయన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే ఆ పథకాలన్నీ మళ్లీ అమలవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు అత్తార్‌రహీంబాషా, నాయకులు రాళ్లపల్లిషరీఫ్, సలీంబాషా, ఉస్మాన, టీడీపీ నాయకుడు చింతపులుసు పెద్దన్న పాల్గొన్నారు.