అయోధ్యలో ఉన్న హనుమాన్‌గఢీ ఆలయ ప్రసాదం ఇక నేరుగా భక్తుల ఇళ్లకు చేరనుంది. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో భక్తుల రద్దీ లక్షల సంఖ్యలో పెరిగింది.
దీంతో చాలామంది భక్తులకు హనుమాన్‌గఢీ ఆలయ దర్శనం సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో తపాలాశాఖ హనుమాన్‌గఢీ ఆలయ ప్రసాదాన్ని పోస్టల్‌శాఖ ద్వారా రూ.251 మనీఆర్డర్‌కు లడ్డూలు, హనుమాన్ చిత్రం, మహావీర్గంధం, అయోధ్య దర్శన పుస్తకం పంపనుంది.