హిమాచల్ ప్రదేశ్‌లో పార్టీని కాపాడుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌ను రంగంలోకి దించారు. అప్పటికే అతను హిమాచల్ చేరుకున్నాడు.
ఆయన వెంట సీనియర్ నేతలు భూపేష్ బఘేల్, భూపిందర్ సింగ్ హుడా ఉన్నారు. పార్టీలోని అసంతృప్త ఎమ్మెల్యేలతో పాటు స్వతంత్ర ఎమ్మెల్యేలతోనూ చర్చలు జరపనున్నారు. అధికార సంక్షోభం ముగిసేవరకూ డీకే అక్కడే ఉంటారని సమాచారం.