పామూరులో ఉన్న దేవస్థాన భూములు ఆక్రమించిన వారిపై కేసు నమోదుకు సిఫార్సు చేస్తామని మదన వేణుగోపాలస్వామి దేవస్థాన చైర్మన్ గుర్రం వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. స్థానిక నెల్లూరు రోడ్డులో ఉన్న మదన వేణుగోపాలస్వామి, వల్లిశమేత భుజంగేశ్వరస్వామి ఆలయాలకు చెందిన 441/1, 2, 3, 442/1, 2, 3లలోని మొత్తం 15. 37 ఎకరాల భూమి ఉంది. కొందరు అక్రమంగా రాత్రివేళల్లో నిర్మాణాలు చేపట్టి ఆలయ భూములను ఆక్రమిస్తున్నారు.