వైసిపి ఒంగోలు పార్లమెంట్ ఇన్ చార్జ్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ విప్ గాను, చంద్రగిరి శాసనసభ్యులుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2014, 2019లోనూ చంద్రగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఒంగోలు పార్లమెంట్ రీజినల్ కోఆర్డినేటర్ గా ఉన్న వీరిని ఎంపీ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది.