చంద్రబాబు ది ముష్టి పరిపాలన అని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. సీఎం వైయస్ జగన్ పాలన మిగతా పాలనకు భిన్నంగా ఉంటుంది.. అన్ని రంగాలలో మార్పులు తీసుకువచ్చారని చెప్పారు. రాజదాని పేరు చెప్పి వ్యాపారం చేసుకునే చంద్రబాబుకు పేదవాడి కష్టాలు ఎప్పుడు తెలుస్తాయి. ఇలాంటివి మాట్లాడుతాననే చంద్రబాబు ఇక్కడికి వచ్చి నన్ను తిడతాడని ధ్వజమెత్తారు. ఇప్పిలిలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం భవనాలను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు.