సీఎం జగన్ విధ్వంసకర పాలన అంతమొందించేందుకే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి సభ ఏర్పాటు చేశారు. గూడెంలో టీడీపీ హయాంలో చేపట్టిన ఎన్నో అభివృద్ధి పనులను ఈ ప్రభుత్వం వచ్చాక వదిలేశారు. ఇక్కడ డిప్యూటీ సీఎం చిల్లరకొట్టు సత్యనారాయణ అధ్వాన్న పాలన వల్ల రెండో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రెయిన్, ఏపీ నిట్లో సీట్లు వంటి సమస్యలు ఉండిపోయాయి అని టీడీపీ తాడేపల్లిగూడెం ఇన్చార్జి వలవల బాబ్జి అన్నారు.