ప్రత్యేక హోదా డిమాండ్‌తో యువజన, విద్యార్థి జేఏసీ ‘ఛలో సీఎం కార్యాలయం’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దానికి జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ, వామపక్షాలు మద్దతు పలికాయి.
అందులో భాగంగా నేడు సీఎం క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.