మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం ఇప్పటికీ తేలలేదు. ఈ ఘటన జరిగి ఐదేళ్లు పూర్తి కావొస్తోంది. నిందితులకు శిక్షపడేలా వివేకా కుమార్తె సునీతా రెడ్డి న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు.
శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ‘సీబీఐ దర్యాప్తుకు వెళ్దామని జగన్ను అడిగా. సీబీఐకి వెళ్తే అవినాష్ బీజేపీలోకి వెళ్తారని జగన్ అన్నారు. అయినా నేను సీబీఐకి వెళ్లి ఫిర్యాదు చేశాను. అప్పటి నుంచి వేధింపులు పెరిగాయి.’ అని అన్నారు.