పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తారన్న ప్రచారంతో వైసీపీ అక్కడ అభ్యర్ధిని మళ్లీ మూడోసారి మార్చేందుకు వైసీపీ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుకు టికెట్ నిరాకరించడం జరిగింది. ఆ స్థానంలో కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురానికి జగన్ బదిలీ చేశారు. ఇప్పుడు పవన్ పోటీ చేస్తారన్న భయంతో మళ్లీ అభ్యర్థిని మార్చడానికి అడుగులు వేస్తున్నారని టాక్. అసెంబ్లీ ఇన్చార్జిగా కోరి మరీ తెచ్చుకున్న వంగా గీతను అక్కడి నుంచి పంపేసేందుకు వైసీపీ యత్నిస్తోందని సమాచారం. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న కలిసిన గీతకు జగన్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. ఈమె స్థానంలో పిఠాపురం నుంచి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని బరిలోకి దించాలని వైసీసీ యోచిస్తోంది. తాజాగా టీడీపీతో పొత్తుకు సంబంధించి పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా ముద్రగడ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ముద్రగడను పార్టీలోకి తెచ్చుకునేందుకు జగన్ మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.