ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గన్నవరం ప్రశాంతంగా ఉండాలంటే టీడీపీ జెండా ఎగరాలసిందే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 02, 2024, 11:50 AM

‘‘మహిళల అభ్యున్నతికి టీడీపీ ఎంతో చేసింది. అదే ఒరవడిని చంద్రబాబు కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్‌ బిడ్డను అవమానించిన వారికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుదాం.’’ అని తెలుగు మహి ళలకు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు పిలుపుని చ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మహిళలపై లైంగిక దాడులు పెరిగా యన్నారు. గన్నవరంలోని ఓ ఫంక్షన్‌ హాలులో తెలుగు మహిళ నియోజ కవర్గ అధ్యక్షురాలు మేడేపల్లి రమాదేవి అధ్యక్షతన శుక్రవారం తెలుగు మహిళలతో నిర్వహించిన మీతో మీ నాయకుడు చర్చావేదికలో యార్లగడ్డ మాట్లాడారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై టీడీపీ అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తానని అన్నారు. కొండలు, గుట్టలు తవ్వి అక్రమ మైనింగ్‌ చేసి అసైన్డ్‌ భూములను అన్యాక్రాంతం చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని దొంగ ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు రంగం సిద్ధమైందని, వెళ్లిపోయిన తహసీల్దారు పేరుతో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చూస్తున్నారని అధికారులు ఇందులో పాలుపంచు కుంటే అధికారంలోకి వచ్చాక అంతకంతకు అనుభవిస్తారని ఆయన హెచ్చ రించారు. బ్రహ్మయ్యలింగం చెరువును అడ్డగోలుగా దోచేసి దేవుడి విగ్రహా లను పెకిలించి తరలించారన్నారు. గన్నవరం ప్రశాంతంగా ఉండాలంటే టీడీపీ జెండా ఎగరాలన్నారు. మల్లవల్లి, వీరపనేనిగూడెంతో పాటు విమానా శ్రయం ఎదురుగా ఉన్న 15ఎకరాల్లో ఎంఎన్‌సీలను తీసుకువస్తానని హామీ ఇచ్చారు. టీడీపీ నాయకులపై, కార్యాలయంపై దాడి బాధాక రమన్నారు. మహిళలకు రుణ వసతి కల్పించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వరానున్న ఎన్నికల్లో టీడీపీకి మద్ద తుగా ఉండి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. సీబీ ఎన్‌ ఫోరం మహిళా సభ్యురాలు సుమిత్ర, యార్లగడ్డ వెంకట్రావు సతీమణి జ్ఞానేశ్వరి, మూల్పూరు సాయి కల్యాణి, మండవ లక్ష్మి, చిక్కవరపు నాగమణి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com