తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఈ నెల 8వ తేదీన పాడేరు రానున్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలతో ఇబ్బందులు పడుతున్న, సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగ సంఘాలతోపాటు ఇతరులతో ‘ప్రజాగళం’ పేరిట ఆయన ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వైసీపీ పాలనలో అవస్థలు పడుతున్న ప్రతి వ్యవస్థకు సంబంధించిన పెద్దలు, సంఘాల నేతలు స్వయంగా కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం పాడేరు నుంచి విశాఖపట్నం వెళ్లే మార్గంలో ఎస్పీ కార్యాలయానికి ఎదురుగా వున్న ప్రదేశాన్ని శుక్రవారం టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పరిశీలించారు. ప్రజాగళం పర్యవేక్షణ బృందం ఆమోదంతో సోమవారం నుంచి ఏర్పాట్లు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సోమెలి చిట్టిబాబు, గంగపూజారి శివకుమార్. డప్పొడి వెంకటరమణ, కూడి రామునాయుడు, బుక్కా జగధీశ్, జ్యోతికిరణ్, తదితరులు పాల్గొన్నారు.