వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు శనివారం టీడీపీలో చేరనున్నారు. మక్కెన కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా రాజకీయ జీవితం కొనసాగించారు. 2019లో వైసీపీలో చేరి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విజయానికి కృషి చేశారు. తనకు గుర్తింపు ఇవ్వకపోవడం, అహంకారం పూరిత ప్రవర్తనతో విసుగు చెంది చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్లు మక్కెన ప్రకటించారు.