ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రైతు­లు లబ్ధిపొందలేకపోయారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 02, 2024, 12:07 PM

 కుల, మత, రాజకీ­యా­లకతీతంగా రైతు కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు అందిస్తోందని, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్‌ రూ.5 వేల పింఛన్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టారని ఎమ్మె­ల్యే ఆర్కే తెలిపారు. అయన మాట్లాడుతూ.... చంద్రబాబు రాజధాని ప్రాంతంలో తమ స్వార్థం కోసం, స్వలాభం కోసం రైతులను, రైతు కూలీ­లను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రైతు­లు లబ్ధిపొందలేకపోయారని, ఇక రైతు కూలీల జీవితాలైతే అగమ్యగోచరంగా తయా­రైన పరిస్థితు­లను చూశామన్నారు.రాజధాని నిర్మా­ణం పేరుతో రైతుల భూములను తీసుకున్న చంద్రబాబు.. రాజధానిని నిర్మించలేకపోవడంతో పా­టు రైతులు, రైతు కూలీలకు న్యాయం చేయలే­కపో­యాడని విమర్శించారు.  ఇలాంటి పరిస్థితుల్లో అధి­కారం చేపట్టిన వైఎస్‌ జగన్‌ అసెంబ్లీ సాక్షిగా తాను రైతు కూలీలను ఆదుకుంటానని వాగ్దానం చేశారని, ఆ మేరకు రూ.2,500గా ఉన్న రైతు కూలీ­ల పింఛన్‌ను రూ.5 వేలకు పెంచారని ప్రశంసించారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com