రాజధాని ప్రాంత రైతు కూలీలు సీఎం వైయస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతు కూలీల పింఛన్‌ను సీఎం వైయస్ జగన్ రూ.5 వేలకు పెంచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా యర్రబాలెం, నిడమర్రులో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గంజి చిరంజీవితో కలిసి పర్యటించి వలంటీర్ల ద్వారా రైతు కూలీలకు రూ.5 వేల చొప్పున పింఛన్‌లను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో యర్రబాలెంలో పలువురు లబ్ధిదారులు సీఎం వైయస్ జగన్ చిత్రపటానికి, నిడమర్రులో వైయస్ఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa