ఏపీకి ప్రత్యేక హోదా తెస్తానంటూ పులిలా గర్జించిన సీఎం జగన్.. ఇప్పుడు పిల్లిలా మారిపోయాడని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, ఎలాంటి హామీ ఇవ్వని బీజేపీకి టీడీపీ,
వైసీపీ ఎందుకు ఊడిగం చేస్తున్నాయో అర్థం కావట్లేదన్నారు. పాలకులు, ప్రతిపక్షం బీజేపీకి బానిసగా మారడం మన కర్మ అన్నారు. వైఎస్సార్ కూతురిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించి తీరుతానని షర్మిల తెలిపారు.