ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా మొనాకో నిలిచినట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆధారంగా అక్కడ 1 మిలియన్ డాలర్లకు(రూ.8.28 కోట్లు) కేవలం 172 చదరపు అడుగుల స్థలం కొనుగోలు చేయగలమని పేర్కొంది.
అదే విలువకు హాంకాంగ్‌లో 237 చ.అ, సింగపూర్‌లో 344, లండన్‌లో 355, జెనీవాలో 366, న్యూయార్క్‌లో 366, లాస్‌ఏంజెలిస్‌లో 409, ముంబైలో 1,109 చదరపు అడుగుల స్థలం కొనుగోలు చేయొచ్చని తెలిపింది.