చంద్రబాబు నీచుడు, పవన్ కళ్యాణ్ ఒక సైకో అంటూ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి మండిపడ్డారు. సీఎం జగన్‌ను విమర్శించే హక్కు పవన్‌కు లేదని, ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు కనిపించడం లేదా? అని ఆమె ధ్వజమెత్తారు.
విశాఖపట్నంలో ఆమె మాట్లాడుతూ.. ‘చంద్రబాబు నీచుడు.. ఎన్టీఆర్ కుటుంబాన్ని చీల్చాడు. ఇప్పుడు జగన్ కుటుంబాన్ని చీల్చుతున్నాడు. చంద్రబాబు చేతిలో సునీత కీలుబొమ్మగా మారింది.’ అని ఆరోపించారు.