గుంతకల్లు పట్టణంలో 37వ వార్డులోని నాయిబ్రాహ్మణ కాలనీకి 24 లక్షల మున్సిపల్ నిధులతో నిర్మించనున్న సిమెంటు రోడ్డు నిర్మాణానికి శుక్రవారం నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి భూమిపూజ చేశారు. దశాబ్దాల కాలంగా ఉన్న రోడ్డు సమస్యను పరిష్కారం చేసినందుకు నాయిబ్రాహ్మణ సంఘం నేతలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భవాని, మాజీ చైర్మెన్ రామలింగప్ప తదితరులు పాల్గొన్నారు.