ఈ సారి ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దీంతో వేసవి నుండి ఉపశమనం పొందాలంటే కేరళ టూర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
కేరళ పర్యావరణం, రుచికరమైన ఆహారం మిమ్మల్ని మైమరిపిస్తుంది. కేరళలోని అత్యంత అందమైన పర్యాటక ప్రదేశాలలో వయనాడ్ ఒకటి. దీంతో పాటు, మడ అడవులు, పచ్చని వరి పొలాలు, కొబ్బరి తోటలతో నిండి ఉన్న కుమరకోమ్ మరో అద్భుత ప్రదేశం మిమ్మల్ని వేసవి తాపం కనిపించకుండా చేస్తుంది.