కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు అర్హత వయస్సును 80 నుంచి 85 ఏళ్లకు పెంచింది.
ఈ మేరకు ఎన్నికల నియమావళి-1961లోని క్లాజ్ (27A) ను సవరిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుండి ఇప్పటి వరకు, వృద్ధులు 11 రాష్ట్రాలు/యూటీలలో ఈ సౌకర్యాన్ని పొందుతున్నారు. ఈ పోస్టల్ బ్యాలెట్‌ను వికలాంగులు మరియు ఎన్నికల సిబ్బంది కూడా ఉపయోగించవచ్చు.