అమెరికాలో జరిగిన కాల్పులకు ప్రముఖ భరతనాట్య, కూచిపూడి కళాకారుడు అమర్నాథ్ బలయ్యాడు. ఫిబ్రవరి 27న ఈవినింగ్ వాక్ చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపినట్లు టీవీ నటి దేవోలీనా భట్టాచార్జీ సోషల్ మీడియాలో తెలిపారు.
అమెరికాలోని అతని స్నేహితులు అమర్నాథ్ మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని, భారత రాయబార కార్యాలయం అమర్నాథ్ ఘోష్ హత్యకు గల కారణాన్ని తెలుసుకోవాలని ఆమె కోరారు.