టీడీపీ-జనసేన కూటమితో పొత్తుపై బీజేపీ అధిష్టానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో పొత్తులపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు.
శనివారం ఆమె మాట్లాడుతూ.. టీడీపీ-జనసేన కూటమితో పొత్తుపై అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. అధిష్టానం నుంచి నిర్ణయం వచ్చే వరకు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలపై మా దృష్టి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.