పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా అధికార బీజేపీ రీసెంట్గా తొలి జాబితా విడుదల చేసింది. రాబోయే ఎన్నికల్లో 400 సీట్లే లక్ష్యంగా.. బీజేపీ తొలి జాబితాలో 195 మంది పేర్లను ప్రకటించింది.
ఇందులో తెలంగాణ నుంచి 9 మంది ఉండగా.. ఏపీ నుంచి ఒక్కరి పేరు కూడా ప్రకటించలేదు. దీనికి కారణం పొత్తులపై సమాలోచనలేనా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది చర్చనీయాంశంగా మారింది.