ఏపీలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. జనరల్ విభాగంలో సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలకు 4,16,918 మంది విద్యార్థులకు గాను 4,05,925 మంది,
ఒకేషనల్ జీఎఫ్సీ పరీక్షకు 37,389 మందికి గాను 34,894 మంది పరీక్షకు హాజరయ్యారు. జనరల్ విభాగంలో 10,621 మంది, ఒకేషనల్ విభాగంలో 2,495 మంది గైర్హాజరయ్యారు. నాలుగు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి.