ఈ ఏడాది వేసవి దడ పుట్టించనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ ఉష్ణతాపం తీవ్రంగానే ఉంటుందని పేర్కొంది. మార్చి నుంచి మే వరకు మూడు నెలలు ఎండలు మండిపోనున్నాయి.
ఏపీలో మార్చి మూడో వారం నుంచే ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగి వడగాల్పులకు ఆస్కారం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్ స్టెల్లా తెలిపారు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 58 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.