జగన్ను విమర్శిస్తే చంపేస్తానని ఓ వైసీపీ కార్యకర్త చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలంలోని టీడీపీ సర్పంచ్ రీటా భర్త ఎల్లప్పను సెల్ఫోన్లో బెదిరించాడు. ‘సోషల్ మీడియాలో సీఎం జగన్ను విమర్శించే స్థాయి నీకు లేదు.
మా బాస్ నన్ను ఆపుతున్నారు కాబట్టే ఇంకా నువ్వు రోడ్డుపై తిరుగుతున్నావు. లేకుంటే కుప్పంలో అడుగుపెట్టేవాడివి కావు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో.. నీ అంతు చూస్తా.’ అని బెదిరించాడు. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు.