నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. టీడీపీని ఓడించేందుకు వైసీపీ ఎత్తుగడలు వేస్తోంది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు టీడీపీ టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఆమెను ఓడించేందుకు వైసీపీ పెద్ద స్కెచ్ వేస్తోంది. అఖిల ప్రియ పెద్దనాన్న కొడుకు భూమా కిషోర్ రెడ్డిని వైసీపీ తమ పార్టీలో చేర్చుకొని ఆమెపై పోటీగా దింపనుంది. నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డితో కిషోర్ రెడ్డి చర్చలు జరిపారు. త్వరలో ఆయన వైసీపీలో చేరనున్నట్లు సమాచారం.