హిమాచల్ ప్రదేశ్లో పలుచోట్ల వర్షం, హిమపాతం కారణంగా వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ స్తంభించింది. రాష్ట్రంలో వర్షాలు,
ఎత్తైన ప్రాంతాలలో మంచు కురుస్తున్నందున నాలుగు జాతీయ రహదారులతో సహా 350 రహదారులను మూసివేశారు. హిమాచల్లో ఉష్ణోగ్రతలు కూడా భారీగా పడిపోయాయి. ఈ ప్రాంతం మొత్తం చలిగాలుల్లో చిక్కుకుంది.