అన్నమయ్య జిల్లా నందలూరు మండలం పాతూరుకు చెందిన ఇంటర్ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. పోలీసులు వివరాల ప్రకారం పాతూరుకు చెందిన శ్రీవిద్య స్కూటీపై మండలంలోని నాగిరెడ్డిపల్లెకు వెళ్లి కిరాణా సరకులు తీసుకుని వస్తోంది.
ఈ క్రమంలో ఆమె స్కూటీని ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో శ్రీవిద్య అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్నిఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa