జార్ఖండ్‌లో స్పానిష్ టూరిస్ట్‌పై సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసారు. స్పెయిన్‌కు చెందిన మహిళ రాష్ట్ర రాజధాని రాంచీకి 300 కిలోమీటర్ల దూరంలోని హన్స్‌దిహా పోలీస్ స్టేషన్ పరిధిలోని కురుమహత్‌లో శుక్రవారం సామూహిక అత్యాచారానికి గురైంది, అక్కడ ఆమె తన భర్తతో కలిసి డేరాలో రాత్రి గడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. సిఆర్‌పిసి సెక్షన్ 164 కింద ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు వారు తెలిపారు.సమావేశంలో పోలీసు సూపరింటెండెంట్ పితాంబర్ సింగ్ ఖేర్వార్ మాట్లాడుతూ, మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించామని, అత్యాచారం జరిగినట్లు నిర్ధారించామని చెప్పారు.ఈ నేరానికి పాల్పడిన ఏడుగురిలో ముగ్గురిని జైలుకు పంపామని, మిగతా నలుగురిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.మిగిలిన నలుగురు నిందితులను గుర్తించామని, సోదాలు జరుగుతున్నాయని, వారిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన చెప్పారు.న్యూఢిల్లీలోని స్పెయిన్ రాయబార కార్యాలయంతో పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారని ఖేర్వార్ తెలిపారు.