విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం దేవస్థానంలో రామచంద్ర ప్రభువుకి సోమవారం ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. వెండి మండపంలోని ఉత్సవమూర్తులకి శాస్త్రోక్తంగా అర్చక స్వాములు వేడుకగా నిత్యకల్యాణం జరిపించారు. అలాగే యాగశాలలో వేదపండితులు సుదర్శన అష్టకవచం హోమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై రామస్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమాన్ని ఆలయ ఇఓ పర్యవేక్షించారు.