జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నట్లు ప్రకటించారు. జేఎంఎం అధ్యక్షుడు శిబూసోరెన్ ఆశీస్సులను తీసుకున్నారు. హేమంత్ సోరెన్‌ను కలిసిన తర్వాత ఆమె ఆదివారం ఎక్స్ (ట్విటర్)లో ఈ ప్రకటన చేశారు.
జార్ఖండ్ ప్రజల కోరిక మేరకు రాజకీయాల్లోకి వస్తున్నానని, హేమంత్ సోరెన్ ప్రజల మధ్యకు వచ్చే వరకు ఆయన వాయిస్ వినిపిస్తానని చెప్పారు. తనను ఆదరించాలని కోరారు.