దేశంలో రోజూ రోజుకి ఆన్‌లైన్ షాపింగ్ క్రేజ్ పెరుగుతోందని ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్(పీడబ్ల్యూసీ) ఇండియా నివేదిక వెల్లడించింది. గత కొన్నేళ్లలో 12.5 కోట్ల మంది ఆన్‌లైన్‌లో షాపింగ్ చేశారని తెలిపింది.
ముఖ్యంగా యాప్స్ ద్వారా కొనుగోళ్లు భారీగా పెరిగాయని, చిన్న సిటీలకూ ఈ-కామర్స్ బిజినెస్ విస్తరించిందని పేర్కొంది. సోషల్ మీడియా ప్రభావంతో 60 శాతం మందికిపైగా ఆన్‌లైన్ షాపింగ్‌కే మొగ్గు చూపుతున్నారని వెల్లడించింది.