అన్నమయ్య జిల్లాలో కన్న కొడుకు వృద్ద తల్లిదండ్రులను చితకబాదాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలయిన విషయం తెలిసిందే. దీనిపై మదనపల్లి 2 టౌన్ పోలీసులు స్పందించారు.
హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వెంకట రమణారెడ్డి, లక్ష్మమ్మలను విచారించి వారి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. ఆస్తి ఇవ్వలేదని తల్లిదండ్రులపై చిన్నకొడుకు శ్రీనివాసులు రెడ్డి ఈ దాష్టీకానికి ఒడిగట్టాడని గుర్తించి అతనిపై కేసు నమోదు చేశారు.