టీడీపీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యేల చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత అనుభవాల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నానన్న ఆయన.. తన కంఠంలో ప్రాణం ఉండగా కుటుంబాన్ని రాజకీయాల్లో రానివ్వనన్నారు.
టీడీపీ అంటే ప్రభాకర్.. ప్రభాకర్ అంటే టీడీపీ అని స్పష్టం చేశారు. కమ్మ సామాజిక వర్గంలో అసంతృప్తులు తనకి సీటు ఇవ్వొద్దంటున్నట్లుగా కొందరు కాకమ్మ కథలు చెబుతున్నారంటూ మండిపడ్డారు.