మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లా బైరాద్ ప్రాంతంలో దారుణం జరిగింది. 26 ఏళ్ల వివాహిత ఒంటరిగా ఉన్న సమయంలో రాకేష్ జాతవ్ గతేడాది వారి ఇంటికి వెళ్లాడు. ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారం చేశాడు.
భర్తను చంపేస్తానని బెదిరించి, ఆమెపై ఏడాదిగా అత్యాచారం చేస్తున్నాడు. భయంతో ఈ విషయం బాధితురాలు ఎవరికీ చెప్పలేదు. చివరికి తల్లి, సోదరుడితో కలిసి వెళ్లి పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.