చట్ట సభల్లో లంచం కేసుల్లో సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదని పేర్కొంది. అసెంబ్లీ,
పార్లమెంట్ ల్లో లంచాలు తీసుకుని ప్రశ్నలు అడిగే ప్రజాప్రతినిధులు విచారణను ఎదుర్కోవాల్సిందేనని సుప్రీం స్పష్టం చేసింది. గతంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం కొట్టేసింది.