భారత రెజ్లర్లు వేసిన పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో నేడు విచారణకు రానుంది. గతేడాది జరిగిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు చట్ట విరుద్ధమని రెజ్లర్లు బజ్రంగ్ పునియా,
వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, ఆమె భర్త సత్యవ్రత్ కలిసి పిటిషన్ దాఖలు చేశారు. డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషన్పై లైంగిక ఆరోపణలతో వీరు వార్తల్లో నిలిచారు.