ప్రకృతి పద్ధతుల ద్వారా సాగు చేసిన ఉత్పత్తులకు స్థానికంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని ఆమెరికాకు చెందిన మెర్సీజారోఫ్ చెప్పారు. యూఎస్ఏకు చెందిన ఫ్యాషన్ క్రాప్ సంస్థ సీఈఓ మెర్సీజారోక్తో పాటు, ఏపీ రైతు సాధికారసంస్థ ప్రతినిధుల బృందం సభ్యులు ఆదివారం సాయంత్రం అమీనాబాద్ సందర్శించారు. గ్రామం పరిధిలో ప్రకృతి విధానంతో సాగవుతున్న వివిధ క్షేత్రాలను బృందం స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు.