కొత్త ఫ్యాబ్‌లు, ప్లాంట్‌లు ఏర్పాటు చేయడానికి తయారీదార్లను ఆకర్శించేందుకు 10 బిలియన్ డాలర్ల ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తున్నట్లు కేంద్ర ఐటీ, టెలికాం మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు.
దీంతో సెమీకండక్టర్ తయారీ రంగంలో వచ్చే ఐదేళ్లలో అంతర్జాతీయ స్థాయికి భారత్ చేరుకుంటుందని అన్నారు. దీంతో చిప్ రంగంలో తైవాన్, ద.కొరియా, చైనాల ఆధిపత్యం తగ్గుతుందని, అలాగే ప్రభుత్వ విధానాలు పెట్టుబడిదార్లను ఆకర్షిస్తున్నాయని తెలిపారు.