ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేదల సొంతింటి కలను నెరవేర్చారని పాలకొండ శాసన సభ్యురాలు విశ్వాసరాయి కళావతి తెలిపారు. పార్వతీపురం - మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, భామిని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో సోమవారం నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు సంక్షేమ పధకంలో భాగంగా 305 మంది లబ్ధిదారులుకు రిజిస్ట్రేషన్ చేసిన "జగనన్న కాలనీ ఇళ్ళ పట్టాలును పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక అంచనాల కమిటీ చైర్మన్ & పాలకొండ నియోజకవర్గ శాసన సభ్యురాలు విశ్వాసరాయి కళావతి చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు, వైస్ ఎంపీపీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, గ్రామ సచివాలయం కన్వినర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జగనన్న కాలనీ ఇళ్ళ పట్టాలు పొందిన లబ్ధిదారులు, మండల రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.