మార్చి 1న చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన జిల్లా మినరల్ ఫండ్ (డీఎంఎఫ్) కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 13 చోట్ల సోదాలు నిర్వహించింది. సోదాల్లో రూ.27 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, డిజిటల్ రూపంలోని ఇతర ఆధారాలతో పాటు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రాజకీయ అధికారులతో కుమ్మక్కైన డీఎంఎఫ్ కాంట్రాక్టర్లు ఖజానా సొమ్మును స్వాహా చేసిన ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన మూడు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.