బీహార్లోని జముయ్లో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. వర్ష కుమారి, ఉమేష్ ప్రేమలో ఉన్నారు. పెద్దలు మరో యువకుడితో ఆమెకు పెళ్లి నిశ్చయించారు. పెళ్లికి మరో వారం రోజులు ఉందనగా ఆమె ప్రియుడితో లేచిపోయింది.
వారిద్దరూ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఈ ప్రేమ జంటను పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో తమను విడదీస్తారనే భయంతో గట్టిగా కౌగలించుకున్నారు. దీంతో హైవోల్టేజ్ డ్రామా నెలకొంది.