టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరాననని ఆ పార్టీ నేత వసంత కృష్ణప్రసాద్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘టీడీపీ కుటుంబంలో ఈరోజు నుంచి నా అడుగులు పడతాయి’’ అని అన్నారు. చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు. వైసీపీలో ఉన్నప్పుడు కొంతమంది నాయకులు తన వల్ల ఇబ్బంది పడిన వారికి క్షమాపణలు తెలిపారు. టీడీపీలో మొదట మా నాన్న గారు పని చేసి ఉన్నారని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు రాష్ట్రానికి అవసరమన్నారు. ఒక్క అవకాశం అని వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏ అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి (YSR) చేసిన అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదన్నారు. సంక్షేమం ఒక్కటే కాదు అభివృద్ధి కోసం ప్రభుత్వం పని చేయటం లేదని వ్యాఖ్యలు చేశారు. విలువలుతో కూడిన రాజకీయాలు చేయటం తనకు అలవాటన్నారు. రాజకీయాలు, అసమ్మతి అనేది మాములే అని.. పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చిన కలిసి పని చేస్తానని వసంత కృష్ణ ప్రసాద్ వెల్లడించారు.