హిమాచల్ ప్రదేశ్ లోని లాహౌల్ - స్పితి జిల్లా ప్రాంతంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. గిరిజన గ్రామానికి చెందిన ఓ బాలుడు తన సోదరిని సమయానికి పరీక్ష కేంద్రానికి చేర్చేందుకు పెద్ద సాహసమే చేశాడు.
ఖంగ్సర్ గ్రామానికి చెందిన రిషిక గొంధా అనే యువతి మంగళవారం 12వ తరగతి బోర్డ్ పరీక్ష రాయాల్సి ఉండగా. రహదారి మొత్తం మంచుతో కప్పుకుంది. ఆమె సోదరుడు పవన్ సోదరిని తన వెనుక రమ్మని కోరాడు. తాను ముందుండి చేతులతో మంచును పక్కకు తొలగిస్తూ సుమారు 3 గంటలు కష్టపడి తన సోదరిని పరీక్ష కేంద్రానికి చేర్చగలిగాడు.