చీమకుర్తి పట్టణానికి చెందిన పలు ముస్లిం కుటుంబాలు టీడీపీని వీడీ వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మంగళవారం చీమకుర్తిలో పర్యటించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మేరుగు నాగార్జున వారికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలన ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉందని వారు తెలిపారు.